రేపటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు..
Ens Balu
3
శంఖవరం
2021-10-03 13:12:40
శంఖవరం మండలంలో రెండు దఫాలుగా రేపటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ జె.రాంబాబు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం శంఖవరంలోని మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 4,5 తేదీ లలో వేలంగి, పెద్దమల్లాపురం, గౌరంపేట, జి. కొత్తపల్లి, అచ్చంపేట, ఎస్.జగ్గంపేట, శంఖవరం, మండపం పంచాయతీలకు, మిగిలిన పంచాయతీ లకు 6, 7 తేదీలలో శిక్షణ జరుతుందన్నారు. రేపు ఉదయం 9.30 గం. లకు ఎమ్మెల్యే, ఎంపీపీల సమక్షంలో శిక్షణ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.