శిక్షణతోనే ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన..


Ens Balu
3
Sankhavaram
2021-10-04 09:24:59

గ్రామపంచాయతీల్లోని వార్డు సభ్యులకు ప్రభుత్వం కల్పించే శిక్షణతోనే వివిధ కార్యక్రమాలపై పూర్తిస్థాయి అవగాహన వస్తుందని ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ అన్నారు. సోమవారం శంఖవరం మండలం కేంద్రంలో ఉపసర్పంచులకు, వార్డు సభ్యులు రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఎంపీపీ పర్వతరాజబాబుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చాలా కాలం తరువాత ప్రభుత్వం వార్డు సభ్యులకు శిక్షణ ఇస్తుందన్నారు. ఈ రెండు రోజులు శిక్షణలో పలు అంశాలపై అవగాహన చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ రానున్న రోజుల్లో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వార్డు సభ్యులు శిక్షణ పొందడం ద్వారా ప్రభుత్వపరమైన అన్ని అంశాలు అర్ధం చేసుకొని ప్రజలకు సేవలు అందించడానికి వీలుపడుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో  ఎంపీడీఓ జె.రాంబాబాబు, ఎంఈఓ ఎస్వీరమణ, ఈఓపీఆర్డీ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు