సమాజంలో మూఢ విశ్వాసాలను పారద్రోలండి..
Ens Balu
2
Narsipatnam
2021-10-04 09:25:47
సమాజంలో మూఢ విశ్వాసాలను పారద్రోలి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మేధావులు విజ్ఞానవంతులు ముందుకు రావాలని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన శాస్త్రీయ సమాజ నిర్మాణం గోడ పత్రికను ఉమా శంకర్ గణేష్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ అంశాలపై ప్రజలను చైతన్య చేస్తున్న జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. టెక్నాలజీ పెరిగిన యుగంలో కూడా మూఢనమ్మకాల వలన చాలా మంది జీవితాలు బలైపోతున్నాయనే వాస్తవాలను గుర్తెరగాలన్నారు. ప్రతీ ఒక్కరూ అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని జీవితంలో ముందడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తుల రెడ్డి, గౌరినాయుడు జోగి నాయుడు తదితరులు పాల్గొన్నారు.