అన్నవరంలో రైతుబజార్ ఏర్పాటుపై కదలిక..
Ens Balu
4
Annavaram
2021-10-04 10:19:25
అన్నవరంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలో అధికారుల స్పందన వచ్చిందని సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా చెప్పారు. సోమవారం అన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నవరంలో రైతుబజారు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు చేసిన అభ్యర్ధనపై వసతి చూపిస్తే రైతు బజారు ఏర్పాటు చేస్తామనే లిఖిత పూర్వక సందేశం వచ్చిందన్నారు. ఈ మేరకు పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం నుంచి అన్నవరంలో రైతుబజార్ ఏర్పాటుకి వసతి చూపించాలంటూ లేక అందిన విషయాన్ని ఆయన తెలియజేశారు. అన్నవరంలో రైతుబజారు ఏర్పాటు అయితే ప్రజలతో పాటు రైతులకు కూడా ఎంతో మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని సర్పంచ్ వ్యక్తం చేశారు.