అన్నవరం దేవస్థానం అధికారులపై రాజ్ భవన్ సీరియస్..


Ens Balu
4
Annavaram
2021-10-05 09:07:13

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం అధికారులపై రాజ్ భవన్ సీరియస్ అయ్యింది. అన్నవరం పంచాయతీ సర్పంచ్ కు ప్రోటోకాల్ పాటించని విషయంలో వివరణ కోరింది. ఈ మేరకు ఒక లేఖను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కు పంపించింది. అందులో ప్రోటోకాల్ పాటించని విషయాన్ని రాజ్ భవన్ లోని గవర్నర్ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. దీనితో ప్రస్తుతం ఈ లేఖ దేవాదాయశాఖలో సంచలనం స్రుష్టిస్తోంది. ఆది నుంచి అన్నవరం దేవస్థానం ఈఓ, అధికారులు ప్రోటోకాల్ పాటించే విషయంలో నిబంధనలు పాటించడం లేదనే బలమైన ఆరోపణలున్నాయి. అసలు దేవస్థానంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా కూడా జాగ్రత్తపడుతూ వస్తారనేది బహిరం రహస్యమే. ఇదే విషయాన్ని  రాజ్ భవన్ లోని గవర్నర్ కు అన్నవరం దేవస్థానం అధికారులు నిభందనల ప్రకారం ప్రోటోకాల్ పాటించలేదనే  సర్పంచ్ కుమార్ రాజా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చి జిల్లా యంత్రాంగం సైతం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. రాజ్ భవన్ నుంచి లేక రావడంతో దేవస్థానం అధికారులు కాస్త కంగారు పడుతున్నారు. అయితే ఇప్పటికైనా సర్పంచ్ కి నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తారా..ఎప్పటి మాదిరిగానే దేవస్థాన అధికారుల పనివారు చక్కబెట్టుకుంటారా అనేది తేలాల్సి వుంది..
సిఫార్సు