సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు పంపిణీ..


Ens Balu
3
Narsipatnam
2021-10-05 10:52:18

ముఖ్యమంత్రి సహాయ నిధితో ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయంటే ఆ ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని నర్సపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా వందల వేల మంది అభాగ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నేడు సహాయం అందుతుందన్నారు. మంగళవారం నర్సీపట్నం మున్సిపాలిటీ 20వ వార్డు సీతయ్యపాలెం గ్రామానికి చెందిన పైల అప్పలనాయడు భార్య కన్నతల్లి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ రూ.75వేల చెక్కులను ఎమ్మెల్యే  తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు ఇన్‌చార్జ్‌ ఈశ్వరరావు,, 19 వార్డ్‌  కౌన్సిలర్‌ బైపురెడ్డి చినబాబు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు