నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గా చిటికెల భాస్కరనాయుడు..
Ens Balu
3
Narsipatnam
2021-10-05 11:07:56
నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఏఎల్ పురానికి చెందిన చిటికెల భాస్కరనాయుడుని ప్రభుత్వం ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి ఉత్తమ సేవలు అందించిన వారికి పార్టీ ఏ స్థాయిలో గుర్తింపు ఇస్తుందో భాస్కరనాయుడుకి దక్కిన పదవిని ఉదాహరణగా ఎమ్మెల్యే వివరించారు. అదేవిధంగా నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో చాలా మందికి డైరెక్టర్లుగా కూడా నియమించినట్టు పేర్కొన్నారు. త్వరలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుల సారధ్యంలో ప్రమాణ స్వీకారాలను ఏర్పాటు చేయనున్నట్టు కూడా ఎమ్మెల్యే తెలియజేశారు. మంచి నాయకులు, గుర్తింపు పొందిన కార్యకర్తలకు మంచి పదవులు దక్కడం పట్ల నియోజకవర్గ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.