సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
Ens Balu
2
Bondapalli
2021-10-05 13:04:55
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటివలస గ్రామ సచివాలయాన్ని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, మూవ్‌మెంట్ రిజిష్టర్లను ఆమె పరిశీలించారు. ఇతర రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం స్పందన వినతులుపై ఆరా తీశారు. గ్రామాల్లో పరిష్కారం కాని సమస్యలను మాత్రమే జిల్లా కేంద్రంలోని స్పందనకు పంపాలి తప్పితే, సాధ్యమైనంత వరకూ గ్రామసచివాలయా స్పందన ద్వారానే సమస్యలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. సచివాలయ పరిధిలో వివిధ పథకాల అమలు ఏవిధంగా జరుగుతుందో తెలుసుకున్నారు. వేక్సినేషన్ ప్రక్రియను శతశాతం పూర్తి చేయాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.