విద్యార్ధినిలకు ఉచితంగా నేప్కిన్లు అందజేత..
Ens Balu
5
రంపచోడవరం
2021-10-05 14:02:43
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా ప్రవేశపెట్టిన స్వేచ్చా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏజెన్సీలోని గిరిజన బాలికల ఆశ్రమ పాటశాలలు, కాలేజీలలో చదువుతున్న బాలిలకలకు ప్రతి నెల శానిటరీ నాప్కిన్స్ అందిస్తామని రంపచోడవరం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి, ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. మంగళవారం స్ధానిక సీతపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాటశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా ప్రవేశపెట్టిన స్వేచ్చా కార్యక్రమాన్ని పురస్కరించుకొని రంపచోడవరం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి, ప్రవీణ్ ఆదిత్య విద్యార్ధుల సమావేశంలో మాట్లాడుతూ ఏజెన్సీలోని ఐ.టి.డి.ఎ. ఆద్వర్యంలో వివిధ పాటశాలల్లో చదువుతున్న ఏడోవ తరగతి పైబడిన బాలికలకు ప్రతినెల శానిటరీ నాప్కిన్స్ అందజేయడం జరుగుతుందని పి.ఒ. తెలిపారు. అదేవిదంగా ఏజెన్సీలోని 35 గిరిజన బాలికల ఆశ్రమ పాటశాలల్లో 5500 మందికి, 5 ఎ.పి.ఆర్. బాలికల పాటశాలల్లో 2400 మంది బాలికలకు, 5 జూనియర్ కాలేజీలలో చదువుతున్న 1750 మంది బాలికలకు, అదేవిదంగా గిరిజన సంక్షేమ శాఖ 14 కాలేజీలల్లో 2500 మందికి మొత్తం 12150 మంది వివిధ పాటశాలల్లో చదువుతున్న బాలికలకు ప్రతీనెలా ఈ శానిటరీ నాప్కిన్లు అందజేయడం జరుగుతుందని పి.ఒ. తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ ఎం.సరస్వతి, ఎ.టి.డబ్ల్యు.ఒ. లు కె.సుజాత, ప్రాదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ ప్రసున్న తదితరులు పాల్గొన్నారు.