రేపటి నుంచి 2వ విడత వార్డు సభ్యులకు శిక్షణ..


Ens Balu
2
Sankhavaram
2021-10-05 18:01:25

శంఖవరం మండలంలో రెండవ విడత వార్డుసభ్యుల శిక్షణ బుధవారం నుంచి 2రోజులు పాటు జరగనుందని ఎంపీడీఓ జె.రాంబాబు  తెలియజేశారు. మంగళవారం శంఖవరంలో ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. అన్నవరం, కత్తిపూడి, సీతాయంపేట,వజ్రకూటం, నెల్లిపూడి, కొంతంగి గ్రామపంచాయతీల్లో వార్డు సభ్యులకు ఈ శిక్షణ ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంమ్మార్సీ సమావేశ మందిరంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 9గంటల కు ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ పర్వత రాజబాబు, జెడ్పీటీసీ సభ్యులు ప్రారంభిస్తారని ఎంపీడీఓ ఆ ప్రకటనలో తెలియజేశారు. 
సిఫార్సు