గ్రామసచివాలయాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి..
Ens Balu
4
Annavaram
2021-10-06 05:33:24
గ్రామసచివాలయాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అన్నిరకాల సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా కోరారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం సుమారు 750 రకాల సేవలను గ్రామసచివాలయాల నుంచే అందిస్తున్నదన్నారు. అన్నవరంలో 3 సచివాలయాల పరిధిలోని ప్రజలు ఆయా సచివాలయాలకు వెళ్లి సమస్యల పరిష్కారంతోపాటు, ప్రభుత్వ సేవలను సైతం వినియోగించుకోవాలని కోరారు. పోలీస్ సేవల నుంచి కులద్రువీకరణ పత్రాల వరకూ అన్ని ఒకే చోట పొందవచ్చునని సర్పంచ్ చెప్పారు.