కాలేజీ యువత ఓటు నమోదు చేసుకోవాలి..
Ens Balu
3
శంఖవరం
2021-10-07 07:10:39
డిగ్రీ కాలేజీలో విద్య అభ్యసిస్తున్న 18ఏళ్లు దాటిన విద్యార్ధులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లంతా ఓటరుగా నమోదు కావాలని శంఖవరం తహశీల్దార్ కె.సుబ్రహ్మణ్యం సూచించారు. గురువారం కత్తిపూడి సీతారామ డిగ్రీ కాలేజీలో ఓటు నమోదుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఓటు హక్కు వచ్చేనాటికి ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఓటు నమోదు చేసుకోవడానికి సవరణలు చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక అండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వీరబాబు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అక్కారావు, వెంకటరావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.