అన్నవరం శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా నిలుపుదల చేయబడిన నిత్య అన్నదానం తిరిగి శుక్రవారం నుంచి భక్తుల సౌకర్యార్థం ప్రారంభిస్తున్నట్టు ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈ మేరకు గురువారం ఆయన అన్నవరంలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు రేపటి నుంచి నిత్యాన్నదానం అందుబాటులోకి వస్తుందని, భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ఈ సందర్భంగా ఈఓ ఆ ప్రకటనలో కోరారు.