అన్నవరం దేవస్థానంలో అన్నసత్రం ప్రారంభం..
Ens Balu
3
Annavaram
2021-10-08 14:28:55
అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణస్వామివారి దేవస్థానంలో చాలా కాలం తరువాత భక్తుల సౌకర్యార్ధం అన్నసత్రాన్ని తిరిగి ప్రారంభించారు. స్వామివారి అన్నసత్రంలో దేవస్థానం చైర్మన్ ఐవిరోహిత్ ఆధ్వర్యంలో ఈఓ వేండ్రత్రినాధరావు, సహాయ కమిషనర్ డిఎల్బీ రమేష్, ఇతర సభ్యులు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, స్వామిదయతో కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్నప్రసాదాన్ని భక్తులకు అందించాలనే సంకల్పంతో సత్రాన్ని తిరిగి ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు గాదె రాజశేఖర్ రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.