అన్నవరంలో మంచినీటి పథకానికి మరమ్మతులు..


Ens Balu
4
Annavaram
2021-10-08 16:37:44

అన్నవరం మేజర్ పంచాయతీలో మంచినీటి పథకానికి మరమ్మతులు చేయించి నీటిసరఫరా అంతరాయన్ని నియంత్రించినట్టు సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా చెప్పారు. శుక్రవారం ఈ మేరకు అన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెదరావిచెట్టు కేంద్రం వద్ద పాడైన బోరుని, మంచినీటి పథకాన్ని తక్షణమే రిపేరు చేయించి వాడుకలోకి తీసుకొచ్చినట్టు ఆయన వివరించారు. ఈ పథకం కింద సుమారు 500పైగా ఇళ్లకు మంచినీరు సరఫరా జరుగుతుందని ఆయన తెలియజేశారు. గ్రామంలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి క్రుషిచేస్తున్నట్టు సర్పంచ్ చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు