జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలి..


Ens Balu
3
Narsipatnam
2021-10-09 12:30:16

జాతీయ స్థాయిలో నర్సీపట్నం కీర్తిని ఇనుమడింపజేసే విధంగా క్రీడాకారులు తయారు కావాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పిలుపునిచ్చారు. సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ పోటీలలో మన నర్సీపట్నంకు చెందిన ఇద్దరు బాక్సర్లు బంగారు పథకం సాధించారు. ఈ నెల 2,3తేదీల్లో విశాఖ లో జరిగిన స్టేట్‌  సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ ట్రైల్స్‌ విభాగంలో పాపని నాగమౌనిక(75కేజీలు), కోలుకుల కృష్ణవేణి(66కేజీలు) గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే , ఇమ్మానుయేల్‌ హాస్పిటల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ సంస్థలు అధినేత కే.జీవన్‌రాయ్‌ శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్‌ మాట్లాడుతూ నర్సీపట్నంలో ఎక్కువ మంది మహిళా క్రీడా కారులు మెడల్స్‌ సాదిస్తున్నందు వలన మనకు త్వరలో మహిళా కోచ్‌ను  స్పోర్ట్స్‌ అథారిటీ ద్వారా తీసుకు రానున్నట్లు తెలిపారు. జీవన్‌రాయ్‌ మాట్లాడుఉతూ ఇమ్మానుయేల్‌ కాలేజీలో నర్సింగ్‌ స్టూడెంట్‌రాష్ట్ర స్థాయిలో గోల్డ్‌ మెడల్‌ సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. నింజాస్‌ అకాడమీ ద్వారా నర్సీపట్నంలో ఎన్నో పతకాలు సాధిస్తున్న క్రీడాకారులకు ధన్యవాదాలు తెలిపారు. నింజాస్‌ అకాడమీ చైర్మన్‌ వెలగా నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ఎన్నో పతకాలు సాధిస్తున్న మన క్రీడాకారులకు నర్సీపట్నం ప్రముఖులు, ఎమ్మెల్యేచే నగదు ప్రోత్సాహకాలు కూడా అందజేస్తున్నామని తెలిపారు. క్రీడాకారులు పాపని నాగమౌనిక, కోలుకులకృష్ణవేణిలు ఇది వరకు 8కి పైగా జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని, అందులో మౌనిక ఐదు నేషనల్‌ మెడల్స్‌, కృష్ణవేణి 4 మెడల్స్‌ సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్‌ సిరసపల్లి నాని, వైసిపి నాయకులు, నర్సింగ్‌ కాలేజీ స్టాఫ్‌ పాల్గొన్నారు.
సిఫార్సు