వైఎస్సార్ ఆసరాపై అవగాహన పెంచుకోవాలి..


Ens Balu
2
Narsipatnam
2021-10-09 12:31:38

మహిళా మనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పథకంపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని నర్సీపట్నం ఎంపిపి  సుర్ల రాజేశ్వరి పిలుపునిచ్చారు. శనివారం ధర్మసాగరం సర్పంచ్‌ గొంప కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల హామీలో మాట ఇచ్చి మడమ తిప్పకుండా అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి 100 శాతం హామీలు నెరవేరుస్తున్నారన్నారు. అదేవిధంగా పథకం అమలు కాకుండా అర్హులై ఉన్నవారు గ్రామసచివాలయాల్లో సంక్షేమ సహాయకులను సంప్రదించాలన్నారు. మహిళా సంఘాలు అభివ్రుద్ధి దిశగా పయనించాలని ఆకాంక్షించారు. 
సిఫార్సు