స్పందన కార్యక్రమాన్ని వినియోగించుకోండి..


Ens Balu
2
Narsipatnam
2021-10-10 11:46:36

నర్సీపట్నంలో ఈ నెల 11వ తేదీ సోమవారం నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సమస్యలపై, అన్యాయాలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయాలన్నారు. గతంలో స్పందన కార్యక్రమం విశాఖపట్నంలోనే నిర్వహించేవారని, కానీ కలెక్టర్‌ నర్సీపట్నంలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు అన్యాయంగా తీసేశారని, దీనిపై కలెక్టర్‌కు తెలియజేయాలన్నారు. అన్ని సమస్యలపై స్పందన కార్యక్రమంలో వినతిపత్రాలు అందజేయాలని సూచించారు. 

సిఫార్సు