ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిధులు దారిమళ్లించారు..


Ens Balu
3
Narsipatnam
2021-10-10 11:48:46

ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు, మైనార్టీ సంక్షేమ నిధులలో సొమ్ముని దారి మళ్లిస్తుంటే కార్పొరేషన్‌ చైర్మన్‌లు ఏం చేస్తునన్నారని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రాజాన వీర సూర్యచంద్ర ఆరోపించారు. ఆదివారం నర్సీపట్నంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, మైనార్టీ, కాపు కార్పొరేషన్‌ సంబంధించిన నిధులు దారి మళ్లిస్తుంటే కార్పొరేషన్‌ చైర్మన్‌లు చోద్యం చూస్తున్నారన్నారు. ఆయా జాతులకు సంబంధించి ఉపాధి అవకాశాల కోసం సబ్సిడీ రుణాల కోసం ఆ నిధిని ఖర్చు చేయాలి కానీ ఆ నిధులు దారి మళ్లింపుగా ఉంటే కనీసం ఏ కార్పొరేషన్‌ చైర్మన్‌ కూడా స్పందించిన పాపాన పోలేదన్నారు.  ఆ జాతుల వారికి ఉపాధి కల్పించే విధంగా సబ్సిడీ రుణాలు ఇప్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి కానీ చైర్మన్‌ స్థాయిలో ఉన్న వ్యక్తులు కనీసం స్పందించకపోతే ఆ చైర్మన్‌ పదవికి అర్థం ఏముందన్నారు.  ప్రజలలో ఉన్నఅనుమానాలు నివృత్తి చేసేలా ప్రతి కార్పొరేషన్‌ చైర్మన్‌ స్పందించి ప్రజలకు తెలిసే విధంగా ఏఏ కార్పొరేషన్‌లో ఎంత ఉంది, ఆ డబ్బులు దేనికి వినియోగిస్తున్నామనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం కార్పొరేషన్‌ చైర్మన్‌ కు ఉంటుందన్నారు. ప్రజలను మభ్య పెట్టే విధంగా కార్పొరేషన్లో ఎంత నిధులు ఉన్నాయో తెలియపరచకుండా  ప్రతి కార్పొరేషన్‌ చైర్మన్‌ మాత్రమే ఉంది ఆ నిధుల గురించి ప్రజలకు తెలియచేయకుండా అయోమయ స్థితిలో ఉంచి బ్యాంకులో రుణాలు రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూడి చక్రవర్తి, చెట్టుపల్లి గ్రామ ఉపసర్పంచ్‌ పరవాడ శ్రీను, మోపాడ చిరంజీవి, పరవాడ లోవరాజు, కర్రీ శ్రీను, ఎర్ర ఈశ్వరరావు, రామచంద్ర. మోపాడ వంశీకృష్ణ, మటం వరహాలరావు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు