ఆసరా పథకం తోనే మహిళల జీవనోపాధి..
Ens Balu
4
Salur
2021-10-10 13:01:13
రాష్ట్ర ముఖ్య మంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఆర్థిక స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే పిడిక రాజన్నదొర పేర్కొన్నారు. ఆదివారం సాలూరు మండలంలో రెండవ విడత వై.ఎస్.ఆర్.ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సాలూరు శాసన సభ్యులు పిడిక రాజన్న దొర, ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మండలంలో జీవనోపాధికి, హౌసింగ్ బ్యాంక్ లింకేజిద్వారా 409 మహిళలకు ఒక కోటి డభై ఒక్క లక్ష నలభై ఐదు వేల ఐదు వందల రూపాయల విలువ గల చెక్కును, వై.ఎస్.ఆర్.ఆసరా రెండవ విడత క్రింద 973 సంఘాలలో గల 10,812 మంది సభ్యులకు నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు చెక్కులను శాసన సభ్యులు, ప్రోజెక్ట్ అధికారి స్వయం సహాయక సంఘాలు మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతు మహిళ ద్వారా కుటుంభానికి మంచి జరుగుతుందని గుర్తించిన ముఖ్య మంత్రి వై ఎస్ ఆర్ ఆసరా పథకం ప్రవేశ పెట్టారని మహిళల పై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసరా సొమ్ముతో పిల్లల చదువులకు, జీవనోపాధి.అభివృధి వినియోగించుకొని ఆర్థికంగా మరింత అభివద్ధి చెందాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు పథకాలతో ఆర్థికంగా వారి కుటుంబాలు ఎలా అభివృధి చెందాయో సభ్యులు వివరిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళల ఆర్థికాభివృదికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన ప్రియతమ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అంబటి అనీల్ కుమార్, గ్రంధాలయ చైర్మన్ రెడ్డి పద్మావతి, ఎం.పి.పి గరుగుబల్లి రాములమ్మ, వైస్ ఎం.పి.పి రెడ్డి సురేష్, వై.ఎస్.ఆర్ క్రాంతి పథం ఎ.పి.డి సత్యం నాయుడు, ఎం.పి.డి. ఓ జి.పార్వతి, వైఎస్ ఆర్.సి.పి.నాయకులు, మండలంలో మహిళా సంఘాల సభ్యులు, రెవెన్యూ అధికారులు సిబ్బంది, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.