అన్నవరంలో డిప్యూటీ సీఎం కుమార్తెకు అన్నప్రసాన..


Ens Balu
3
Annavaram
2021-10-10 17:44:26

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, పరీక్షిత్ రాజు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  దేవస్థానం చైర్మన్ ఐవి.రోహిత్, అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబు, వేద పండితులు మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పూర్ణ కుంభంతో  స్వాగతం పలికారు. మంత్రి పుష్పశ్రీవాణి దంపతులు తమ కుమార్తెకు అతిథి భవనంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సత్యదేవుణ్ణి దర్శించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా డీప్యూటీ సీఎం మాట్లాడుతూ, సత్యదేవుని సన్నిధిలో తమ బిడ్డకు అన్నప్రసాన చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. స్వామి కరుణతో కరోనా సమసిపోయి రాష్ట్రం శుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు చెప్పారు. కాగా మంత్రి కుటుంబ సభ్యులకు దేవస్థానం వేద పండితులు ఆశీర్వచనం, శేష వస్త్రం అందించగా ప్రసాదాలను దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఐవీ.రోహిత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్వోకొండలరావు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు