కత్తిపూడిలో డ్రైనేజీ పై పేలిన కట్టడాలు..


Ens Balu
4
Kathipudi
2021-10-11 06:39:42

శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో హైవే డ్రేనేజిలపై విచక్షణా రహితంగా కట్టిన కట్టడాలు డ్రైనేజీ నుంచి వచ్చి గ్యాస్ వాయువల కారణంగా సోమవారం ఉదయం పేలిపోయాయి. అయితే ఆ సమయంలో ఎరికీ ప్రమాదం సంభవించలేదు. డ్రైనేజీలు పై ఎక్కడా గాలి బయటకు పోకుండా నిర్మాణాలు చేపట్టడం వలనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ సిబ్బంది ఆ ప్రాంతాలను పరిశీలించారు. పరిస్థితిని అంచనా వేస్తున్నారు. కత్తిపూడి మేజర్ పంచాయతీ పరిధిలో చాలా కాలం నుంచి డ్రైనేజీలు సక్రమంగా శుభ్రం చేయించడం లేదు. దీనితో డ్రైనేజీల్లోని మురికి నీరు నుంచి గ్యాస్ వాయువులు ఏర్పడి ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంపై పంచాయతీ అధికారులు పూర్థిస్థాయిలో విచారణ చేపట్టి డ్రైనేజీలపై నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. జరిగిన ప్రమాదంలో ఎవరైనా మనుషులు ఉండి ఉంటే ప్రాణాలు పోయేవని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిఫార్సు