విశాఖ నుంచి నర్సీపట్నం వచ్చిన స్పందన..
Ens Balu
5
Narsipatnam
2021-10-11 06:54:23
విశాఖ జిల్లా కలెక్టరేట్ నుంచి స్పందన కార్యక్రమం నర్సీపట్నం తరలి వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు జిల్లాలోని అన్నిశాఖల అధికారులూ నర్సీపట్నంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన స్పందనకు హాజరయ్యారు. స్పందనపై ప్రజల్లో నమ్మకం మరింతగా పెంచాలనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున వినూత్నంగా ముందడుగు వేశారు. స్పందన కార్యక్రమం అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే కాదు. డివిజన్ కేంద్రం నుంచి గ్రామ సచివాలయం వరకూ ఎక్కడ నిర్వహించినా స్పందన ఒకేలా ఉంటుందని, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. జిల్లా అధికారులంతా ఒకేసారి రావడంతో నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనితో పెద్ద ఎత్తున ప్రజలు కలెక్టర్ కు తమ తమ సమస్యలపై అర్జీలు పెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఎం వేణు గోపాలరెడ్డి,ఆర్డీవో ఆర్ గోవిందరావు ఏసిపి మణికంఠ చందోల్, జిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారి తదితరలు ఈ స్పందనలో పాల్గొన్నారు.