వైయస్సార్‌ ఆసరాతో మహిళల ఆర్ధికాభివృద్ధి..


Ens Balu
4
Narsipatnam
2021-10-11 12:27:41

మహిళల ఆర్ధికాభివృద్ధికి వైయస్సార్‌ ఆసరా తోడ్పాటు ఇస్తుందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ అన్నారు. సోమవారం నర్సీపట్నం మండల పరిషత్‌ కార్యాలయంలో వైయస్సార్‌ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సీపట్నం మండలంలో ఆసరా పథకం కింద రెండవ విడతలో 6856 డ్వాక్రా గ్రూప్‌ సభ్యులకు 6 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగినట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ పథకాలను మహిళలు పేరు మీదుగానే మంజూరు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలోకి రావాలని సూచించారు. వైసిపి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్ని పథకాలు మహిళలు పేరుమీదుగానే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, ఎంపీడీవో జయ మాధవి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
సిఫార్సు