అక్క చెల్లెమ్మల స్వావలంభనే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని అందులో భాగంగా ఆసరా కల్పిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ 1,2 వ వార్డుల లబ్ధిదారులకు తగరపువలస బంతాట మైదానంలో, 3,4 వార్డుల లబ్దిదారులకు ఎగువ పేట నూకాలమ్మ గుడి వద్ద, పద్మనాభం మండలంలో MPDO కార్యాలయం వద్ద జరిగిన రెండో దశ ఆసర చెక్కుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముందుగా సీఎం జగన్ చిత్రపటానికి మహిళలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని, మహిళలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రెండో దశ ఆసరా కింద మహిళల బ్యాంకు ఎకౌంట్లలో నగదు జమ చేశారన్నారు. రాష్ట్రంలో 31లక్షలు ఇళ్లు లేని పేదలు ఉంటే వారికి పట్టాలు పంపిణీ చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తంశెట్టి మహేష్ కార్పొరేటర్లు అక్కరమాని పద్మావతి ఎడుకొండలు,కోఆప్సన్ మెంబర్ కొప్పలప్రభావతి భీమిలి MPP వాసురాజు ZPTC వెంకటప్పడు పద్మనాభం MPP మద్ది రాంబాబు, ZPTC సుంకర.గిరిబాబుతో పాటు మండలనాయకులు పాల్గొన్నారు.