స‌చివాల‌యాన్ని త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్‌..


Ens Balu
4
Denkada
2021-10-12 13:51:12

గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు గ్రామంలోనే అన్ని సేవలు అందించడంతోపాటు సమస్యు పరిష్కారం అయ్యేవిధంగా సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిజేశారు. మంగళవారం జిల్లాలోని డెంకాడ మండ‌లం మోపాడ గ్రామ వార్డు స‌చివాల‌యాన్ని, రైతు బరోసా కేంద్రాన్ని ఆమె  ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, మూవ్‌మెంట్ రిజిష్ట‌ర్ల‌ను ఆమె ప‌రిశీలించారు. ఇత‌ర రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. స్పంద‌న విన‌తులుపై ఆరా తీశారు. స‌చివాల‌య ప‌రిధిలో వివిధ ప‌థ‌కాల అమ‌లును తెలుసుకున్నారు. వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను శ‌త‌శాతం పూర్తి చేయాల‌ని సిబ్బందిని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ప్రజలకు ఏ సేవలైనే సచివావాలయంలోనే అందుతాయనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. అనంతరం రైతు బరోసా కేంద్రాన్ని సందర్శించి ఎరువులపై, ఈక్రాప్ నమోదు,రైతు సంక్షేమ పధకాలపై ఆరా తీసారు.
సిఫార్సు