అన్నవరంలో మంచినీటి సమస్య పరిష్కారం..


Ens Balu
3
అన్నవరం
2021-10-13 03:50:35

అన్నవరం పంచాయతీ వాసుల సమస్య పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందే ఉంటానని సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా అన్నారు. బుధవారం అన్నవరం గ్రామంలోని పంపా కెనాల్ పక్కనే వున్న ఏరియాలో ఏర్పాటు చేసిన మంచినటీకి కుళాయిలను సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పంచాయతీ నుంచి ప్రజలకు చేపట్టాల్సిన అన్ని పనులనూ సకాలంలో పూర్తిచేస్తామన్నారు. త్రాగునీరు, పారిశుధ్యం, సమస్యల పరిష్కారంతో ముందుంటామన్నారు. పంచాయతీ పరిధిలో ఏ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా గ్రామవాలంటీరు ద్వారా సచివాలయానికి, పంచాయతీ సిబ్బంది ద్రుష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీరామ చంద్ర మూర్తి.6,7, వార్డ్ మెంబర్లు తాటిపాక సిందూజా.గంపల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు