స్వచ్ఛ అన్నవరానికి ప్రజలు సహకరించాలి..
Ens Balu
2
అన్నవరం
2021-10-13 03:51:17
స్వచ్ఛ అన్నవరానికి ప్రజలు సహకరించాలని సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా అన్నారు. బుధవారం అన్నవరం క్రిందివీధి ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా పంచాయతీ ఏర్పాటు చేసిన చెత్తకుండీల్లో మాత్రమే చెత్తను వేయాలన్నారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం వలన అపారిశుధ్య పెరిగిపోతుందన్నారు. అన్నవరం మేజర్ పంచాయతీని స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.