సంతపైడిపాలలో 930 లీటర్ల సారాధ్వంసం..


Ens Balu
3
Rowthulapudi
2021-10-13 14:41:22

యువత చక్కగా చదువుకోవాలి తప్పితే చెడు మార్గంలో పయనించకూడదని తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.కిషోర్ బాబు యువతకు సూచించారు. బుధవారం రౌతులపూడి మండలంలోని సంత పైడిపాల గ్రామంలో సుమారు 930 లీటర్ల సారాను, గ్రామ సమీప సెలయేరు ప్రాంతంలో 8,500 లీటర్ల బెల్లపు ఊటను కనుగొన్న పోలీసులు వాటిని నాశనం చేసారు. ఈ నేరాలకు బాధ్యులుగా భావిస్తున్న ఎనిమిది మందిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకోగా మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. గ్రామం, దాని పరిసరాలను బుధవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో చుట్టి ముట్టి (కార్డన్ సర్చ్) తనిఖీలు నిర్వహించారు. ఫలితంగా అక్రమంగా దాచిన సారా, బెల్లం ఊట నిల్వలను కనుగొన్నారు. ఈ సందర్భంగా  గ్రామ యువతను సమావేశ పరచిన సిఐ యువతకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ చదువుకుని, ఉన్నత ఉధ్యోగాలు పొందాలని, నాటు సారా, గంజాయి మొదలగు వాటికి దూరంగా ఉండాలని హితవు చెప్తూ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు తెలిపి సహకరించాలని కొరారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు ఎస్సై అశోక్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

సిఫార్సు