ప్రతీ కుటుంబానికి 100 రోజుల ఉపాది పని కల్పింస్తాం..
Ens Balu
5
Sankhavaram
2021-10-14 12:20:25
శంఖవరం పంచాయతీలోని ప్రతీ కుటుంబానికి 100 రోజుల ఉపాది హామీ పనులు కల్పిస్తామని ఎంపీపీ పర్వత రాజబాబు పేర్కొన్నారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని పంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీపీ మాట్లాడుతూ, 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఉపాది పనులను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాది పథకంలో జాబ్ కార్డులేనివారంతా పంచాయతీలను సంప్రదించి జాబ్ కార్డులను పొందాలనున్నారు. అదేవిధంగా స్వచ్చ శంఖవరం కార్యక్రమంలో మన పంచాయతీ ముందుండేలా పంచాయతీని పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామ ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపర్పంచ్ చింతనీడి కుమార్, మూడు గ్రామ సచివాలయా కార్యదర్శిలు, జూనియర్ అసిస్టెంట్ రమణమూర్తి, పంచాయతీ సిబ్బంది, వైస్సార్సీపీ నాయకులు లచ్చబాబు, పడాల బాషా, పడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.