శ్రీ కనకదుర్గమ్మకు వెండి చేయితొడుగు విరాళం..
Ens Balu
6
Sankhavaram
2021-10-14 12:24:36
రౌతులపూడి గ్రామ ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మకు రూ.40వేల విలువైన అరకేజి వెండి చేయి తొడుగుని దివంగత పాసిల ముసిలి గుర్తుగా ఆయన తనయుడు, శంఖవరం గ్రామసచివాలయ జూనియర్ సహాయకులు పాసిలి రమణమూర్తి దంపతులు విరాళంగా సమర్పించారు. గురువారం అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాతూ, నవరాత్రి పర్వదినాల్లో అమ్మవారికి వెండిచేయి విరాళంగా బహూకరించిన దంపతులను ఆయన అభినందించారు. అమ్మదయతో ఈ ప్రాంతం శుభిక్షంగా ఉందని, ఈ కరోనా మహమ్మరి కూడా పూర్తిగా సమసిపోయి తల్లి దీవెనలతో బాగుండాలని ఆకాంక్షిచారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జిగిరెడ్డి శ్రీను, జెడ్పీటీసీ గొల్లి చిన్నదివానం, ఎంపీపీ గట్టిమళ్ల రాజ్యలక్ష్మి, కోపరేటివ్ డైరెక్టర్ పులి మధు, రైతుపూడి ఉపసర్పంచ్ వాసిరెడ్డి భాస్కరబాబు, పైడిపాల సర్పంచ్ జిగిరెడ్డి సత్తిబాబు, అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.