కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు సాధించవచ్చు..
Ens Balu
3
Annavaram
2021-10-14 15:13:45
అన్నవరంలో పంచాయతీ పాలక వర్గ సభ్యులు, ఎంపీటీలు కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునని సర్పంచ్ బి.కుమార్ రాజా అన్నారు. గురువారం అన్నవరంలో పంచాయతీ పాలక వర్గ సభ్యులు, ఎంపీటీసీలతో సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ, టెంపుల్ టౌన్ గా వున్న అన్నవరం పంచాయతీలోని అన్ని వార్డుల్లో ప్రధాన సమస్యలు గుర్తించడం ద్వారా వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించడానికి ఆస్కారం వుంటుందన్నారు. ముఖ్యమంగా పారిశుధ్యం, త్రాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వార్డు సభ్యులు గుర్తించాలన్నారు. ప్రధాన సమస్యలను తమ ద్రుష్టికి తేవడం ద్వారా వాటిని పరిష్కరించి ప్రజలకు సేవలు అందించడానికి అవకాశం వుంటుందన్నారు. అదేవిధంగా పంచాయతీలో మూడు గ్రామ సచివాలయాలు ఉన్నాయని వాటి ద్వారా ప్రభుత్వం అందించే సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకునే లా కూడా పాలకవర్గ సభ్యులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి, ఇతర కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సభ్యులను సర్పంచ్ ఘనంతా సన్మానించారు.