మహిళలను ఆదుకున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే..


Ens Balu
2
Sankhavaram
2021-10-16 11:31:16

ఆంధ్రప్రదేశ్ లో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత సహాయొ మహిళలకు ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చేస్తుందని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. శనివారం శంఖశరం మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆమె పాల్గొని  ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ తో కలిసి  1055 సంఘాలకు రూ. 8  కోట్ల నాలుగు లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైఎస్సార్ ఆసరాతో మహిళలంతా ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలన్నారు. ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మహిళల పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేయూతనందిస్తూ వస్తున్నారన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రప్రభుత్వం చేయని విధంగా మహిళలకు ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణాల మాఫీ దఫ దఫాలుగా  చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీఓ జె.రాంబాబు, తహశీల్దార్ కె.సుబ్రహ్మణ్యం, ప్రత్యేక అధికారి డా.వీరరాజు, ఏసీ అహ్మద్ వల్లీ, వెలుగు సిసి జివిప్రసాద్, నాగలక్ష్మి, సీత తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు