విజయవాడ గులాబితోట, దుర్గాపురానికి చెందిన టివిఎస్ ప్రసాద్ కుటుంబం శ్రీశ్రీశ్రీ అన్నవరం వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం అన్నదాన ట్రస్టుకి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని శనివారం ఇన్చార్జి పీఆర్వో కొండలరావుకి చెక్కురూపంలో దాతలు అందజేశారు. తంగెళ్ల స్నేహిత పేరుపై ఆగస్టు 7న అన్నదానం చేయాల్సిందిగా దాతలు దేవస్థాన సిబ్బందిని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు ఆలయ సిబ్బంది ప్రసాదాలు అందించగా వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.