గ్రామాలను స్వచ్చంగా ఉంచడమే ప్రధాన లక్ష్యం..
Ens Balu
3
Sankhavaram
2021-10-20 06:12:12
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని గ్రామాలన్నింటిని పరిశుభ్రంగా ఉంచేలా ప్రతీ ఒక్కరూ క్రుషి చేయాలని ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచందరప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం శంఖవరం మండల కాంప్లెక్స్ జగనన్న స్వచ్ఛ సంకల్పం క్రింద మండలానికి కేటాయించిన చెత్త తరలించే మినీ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పంచాయతీ శానిటేషన్ సిబ్బందికి అందించాలన్నారు. అదేవిధంగా చెరువులు, కాలువల్లో కూడా చెత్తవేయకూడదన్నారు. మనఇంటిని ఎంత పరిశుభ్రంగా చూసుకుంటామో, గ్రామాన్ని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు.. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్వత రాజబాబు, ఎంపీడీఓ జె.రాంబాబు, పంచాయతీ సర్పంచ్ బందిలి గన్నియ్యమ్మ, ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్, పంచాయతీ సిబ్బంది, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.