గిరిజన రైతుకు పండ్ల మొక్కలు సరఫరా చేయండి..


Ens Balu
3
Paderu
2021-10-20 11:57:38

విశాఖ ఏజెన్సీ వాతావరణానికి అనుకూలంగా ఉండే పండ్ల మొక్కలను గిరిజన రైతుకు సరఫరా చేయాలని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి గోపాల క్రిష్ణ రోణంకి ఆదేశించారు. బుధవారం క్షేత్ర పర్యటనలో భాగంగా పాడేరు మండలం డి .గొందూరు పంచాయతీ మద్దుల బంద గ్రామానికి చెందిన గిరిజన రైతు సీదరి అప్పన్న వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వెలుగు ద్వారా మంజూరు చేసిన సోలార్ పంపును సద్వినియోగం చేసుకుని రెండు ఎకరాల విస్తీర్ణంలో అరటి, జామ పండ్ల తోటలు, టమోటా, పసుపు, సామలు, రాగులు తదితర చిరుధాన్యాలు సాగు చేస్తున్నానని రైతు అప్పన్న ప్రాజెక్టు అధికారికి వివరించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ రైతుకు షెడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కాఫీ మొక్కలు, జామ, కమలా, సపోటా , సీతాఫల మొక్కలను రైతుకు సరఫరా చేయాలని సూచించారు. ఏజెన్సీలో నూతన పంటలను సాగు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ప్రాజెక్టు వ్యవసాయాధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు వ్యవసాయాధికారి బి.భాస్కరరావు,వెలుగు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు