కొఠియా గ్రామ ప్రజలకూ ప్రభుత్వ పథకాలు..


Ens Balu
3
Salur
2021-10-20 11:59:46

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రకటిస్తున్న పథకాలను కొఠియా గ్రామాల మహిళలు అందుకొని సద్వినియోగం చేసుకోవాలని వైఎస్సార్ క్రాంతి పథం(వెలుగు)ఎపిడి సత్యం నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఉదయం మండలంలోని వివాదస్పద కొఠియా గ్రూపు గ్రామాలైన గంజాయి భద్ర, ఎగువ శంబి, దిగువ శంబి, ధూళి భద్ర మహిళా సంఘాలతో ఎగువ శంబిలోను, నేరెళ్ల వలస, మూలతాడివలస, దొరలతాడివలస గ్రామాల మహిళా సంఘాలతో నేరెళ్లవలస గ్రామంలో మండల ఎపిఎం ఎ. జయమ్మ ఆధ్వర్యంలో వేరువేరుగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిడి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలన్నారు. తమ సిబ్బంది సలహాలు, సూచనలను పాటిస్తే అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నరు. ఈ విషయంలో వేరే ఆలోచన పెట్టుకోకుండా తాము చెప్పినట్లుగా ఉన్నతి బ్యాంకు లింకేజి రుణాలు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దానివల్ల మీకుటుంబాలు ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తాయన్నారు. అదేవిధంగా వెలుగు సిబ్బంది గ్రామాల్లో ఇంటింటి సర్వే జరిపి నివేదికను ఇవ్వాలన్నారు. ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు. అలాగే గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను అందిస్తామని, కావున బయట వారికి పంటలను అమ్మరాదన్నారు. అనంతరం ఎసిఎం ఎం. ఆదయ్య, ఎపిఎం ఎ. జయమ్మ తదితరులు మాట్లాడగా, సిసిలు పడాల రామకృష్ణ, బాలరాజు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
సిఫార్సు