ఎన్.బూర్జివలస లో ఇద్దరే జ్వర పీడితులు..
Ens Balu
2
ఎన్.బూర్జివలస
2021-10-20 14:59:01
విజయనగరం బలిజిపేట మండలం ఎన్. బూర్జి వలస గ్రామంలో జ్వరాల తీవ్రత ఏమీ లేదని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా ఎస్.వి.రమణ కుమారి తెలిపారు. పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో ఆ గ్రామాన్ని బుధవారం తాను సందర్శించినట్లు చెప్పారు. తమ వైద్య బృందాలతో గ్రామంలోని 720 మందికీ ఆరోగ్య తనిఖీలు చేశామని అందులో ఇద్దరు మాత్రమే జ్వర పీడితులు ఉన్నట్టు పేర్కొన్నారు. వారికి అవసరమైన పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆరోగ్య పరంగా ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ఈ గ్రామంలో భయాందోళనలు చెందే పరిస్థితి లేదని తెలిపారు.