గాలికుంటువ్యాధి టీకాలను వినియోగించుకోవాలి..


Ens Balu
4
Sankhavaram
2021-10-21 08:54:01

ప్రభుత్వం పాడి రైతుల సహాయార్ధం పశువులకు ఉచితంగా అందజేసే గాలికుంటు వ్యాధి టీకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పర్వత రాజబాబు పిలుపునిచ్చారు.  గురువారం శంఖవరం ప్రభుత్వ పశువుల ఆసుపత్రి వద్ద నిర్వహించిన 30వ విడత పశువులకు గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం జాతీయ పశువ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా వీటిని పశువులకు ఉచితంగానే అందిస్తున్నదన్నారు. గతంలో కంటే ఇపుడు అన్ని రైతు భరోసా కేంద్రం, సచివాలయాల పరిధిలో గ్రామీణ పశువైద్య సహాయకులకు ప్రభుత్వం నియమించిందన్నారు వారి ద్వారా ఈ సేవలను పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా.వీరరాజు, ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్, వైఎస్సారీపీ నాయకులు లచ్చబాబు, పడాల బాషా, పడాల షతీష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు