జనాలను నమ్మించేందుకే చంద్రబాబు కుటిల దీక్షలు..
Ens Balu
2
Narsipatnam
2021-10-22 08:50:41
టిడిపీ ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా చంద్రబాబు తీరుమారలేదని.. 36 గంటలు కాకుండా 360 రోజులు పాటు ఎన్నిదీక్షలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. శుక్రవారం 2వ రోజు పట్టణంలో జనాగ్రహదీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. టీడీపీ నేతలు బూతు పురాణానికి నిరసనగా ప్రజలు తిరగబడుతున్నవిషయాన్ని టిడిపి గుర్తుంచుకోవాలన్నారు. ఉన్న కొద్దిపాటి ఉనికిని కాపాడుకోవడానికి టిడిపీ కొత్తడ్రామాలకు తెరతీసిందన్నారు. ఈ నిరసన లో మాకవరపాలెం,గోలుగొండ,నాతవరం, నర్సీపట్నం రూరల్ మండలాలకు చెందిన వైస్సార్ పార్టీ ఎంపీపీలు, పంచాయతీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.