28న లీ ప్యారడైజ్‌లో లోన్ మేళా..
Ens Balu
3
Vizianagaram
2021-10-22 12:54:18
విజయనగరంలో ఈ నెల 28న లీ ప్యారడైజ్‌లో పలు బ్యాంకుల ఆధ్వర్యంలో లోన్ మేళా నిర్వహించనున్నట్లు ఎల్.డి.ఎం. ఎమ్. శ్రీనివాసు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డి.ఎఫ్.ఎస్. (డిపార్టమెంటల్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్) మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలోని అన్ని బ్యాంకుల సమన్వయంతో రుణ వితరణ క్యాంపైన్ జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ పథకాలకు సంబంధించిన రుణాల మంజూరు ప్రక్రియపై అందరి సమక్షంలో సమీక్ష ఉంటుందని వివరించారు. పీఎంఎంవై, ఎస్‌యూఐ, పీఎంఈజీపీ, జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత తదితర పథకాల లబ్ధిదారులకు ఆయా బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు ఉంటుందని, సంబంధిత చెక్కుల పంపిణీ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జరుగుతుందని వెల్లడించారు. ఈ క్యాంపైన్‌లో సీడీఎం, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, నాబార్డు ప్రతినిధులు తదితరులు పాల్గొంటారని వివరించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.