ప్రజల ఫిర్యాదులను తక్షణమే స్వీకరించండి..
Ens Balu
3
Kothavalasa
2021-10-23 10:34:32
ప్రజల నుంచి వివిధ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తులను తక్షణమే క్లియర్ చేయాలని జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన కొత్తవలస మండలం మంగళపాలెం సచివాయాలన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన వినతులకు సంబంధించిన రికార్డులను, ప్రగతి నివేదికలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన అనర్హుల జాబితాను ప్రదర్శించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కంటకాపల్లి గ్రామంలో అనధికారికంగా నడుస్తున్న ఆర్‌వో వాటర్ ప్లాంట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐ.ఎస్.వో. మార్కు లేకపోవటం, ఇతర నిబంధనలు పాటించకపోటంతో వాటర్ ప్లాంట్‌ను సీజ్ చేశారు. ఆయన వెంట కొత్తవలస తహశీల్దార్, ఎంపీడీవో, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.