ప్రభుత్వ న్యాయ సేవలను వినియోగించుకోవాలి..
Ens Balu
5
నెల్లిపూడి
2021-10-23 10:40:29
ప్రభుత్వం న్యాయవ్యవస్థ ద్వారా అందించే అన్ని రకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాడు జ్యూడిషియరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వి.గోపాల క్రిష్ణ అన్నారు. శనివారం నెల్లిపూడి గ్రామసచివాలయం వద్ద ఏర్పాటు చేసిన న్యాయ అవగాహనా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై చైతన్యం కలిగించారు. కోర్టుల ద్వారా మాత్రమే సత్వర న్యాయం జరుగుతుందన్న ఆయన ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అదేవిధంగా మహిళల హక్కులు, బాధ్యతల కోసం కూడా తెలుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ఐ అజయ్ బాబు, బార్ కౌన్సిల్, నెల్లిపూడి సర్పంచ్ నరాల శ్రీనివాస్, మహిళా పోలీస్ కళాంజలి, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.