అన్నవరంలోని శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారిని రేపు మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు దర్శించుకోనున్నారని దేవస్థాన ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈ మేరకు అన్నవరంలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అన్నిఏర్పాట్లు చేసినట్టు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గవర్నర్ స్వామివారిని ఉదయం 11గంటలకు దర్శించుకొని పూజలు చేసి అనంతరం తిరుగు ప్రయాణం అవుతారని తెలియజేశారు. ఆయనతోపాటు పలువురు బీజేపీ నాయకులు కూడా హాజరు కానున్నారని అందులో వివరించారు.