ప్రతీ ఒక్కరూ కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాలి..
Ens Balu
2
2021-10-23 10:45:39
కరోనా కట్టడికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ వేక్సిన్ వేయించు కోవాలని పార్వతీపురం ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రోజెక్ట్ అధికారి శనివారం తన పర్యటనలో భాగంగా జియ్యమ్మవలస మండలం బి.జె.పురం, తుంబలి గ్రామ సచివాలయాలు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే గ్రామాల్లో ఇంటింటి కి నిర్వహిస్తున్న వెక్షినేశాన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పర్యటనలో ముందుగా సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సచివాలయం సిబ్బంది, వాలెంటిర్లకు సీజనల్ వ్యాధులపై, ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. అలాగే పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు. పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్వం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. అనంతరం గ్రామాలలో ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి వాక్సినేషన్ నిర్వహణపై ఆరా తీశారు. వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా చేయాలని సూచించారు. ఈ సచివాలయాల ఆకస్మిక పర్యటనలో జియ్యమ్మవలస మండల, ఎం.పి.డి.ఓ కె.విజయలక్ష్మి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.