శంఖవరం మండల కేంద్రంలోని గొల్లవీధిలో శ్రీశ్రీశ్రీ విజయదుర్గ మాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అన్నప్రసాదాలు స్వీకరించారు. ప్రతీ ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు పూర్తియిన తరువాత భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టునట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఈ అన్నదానంలో సాధారణ భక్తులతోపాటు, అయ్యప్పస్వాములు, భవానీ భక్తులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. మూడువేల మందికి పైనే ఈ అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదం స్వీకరించారు. అలాగే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో దాతలు కూడా విరాళాలు సమర్పించారు. 15ఏళ్ల నుంచి ప్రతీఏటా కార్యక్రమం క్రమం తప్పకుండా కొనసాగించడం విశేషం.ఈ కార్యక్రమంలో నిర్వహాకులు శ్రీనివాస్,దుర్గాప్రసాద్ తోపాటు, అప్పారావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.