ఉద్యాన పంటల పై అవగాహన కల్పించాలి..
Ens Balu
4
Gummalaxmipuram
2021-10-30 12:40:37
ఉద్యాన పంటలతోనే గిరిజనులు ఆర్థికంగా అభివృధి చెందుతారు అని ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. శనివారం గుమ్మలక్ష్మీపురం మండలం వంగర గ్రామంలో ఎం.జి. ఎన్.ఆర్.జి.ఎస్ పండ్ల తోటల పెంపకంపై ఉద్యానవన రైతు శిక్షణా తరగతులకు ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ గిరిజన రైతుల ఆదాయం అభివృద్ధికి కోసమే ఈ శిక్షణా తరగతులు, నాటిన ప్రతి మొక్క మంచి ఫలసాయం అందించేలా, మొక్కలకు ఎటువంటి హాని కలుగకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం పోడు భూములు ఇవ్వడం జరిగిందని, దానితో పాటు అధిక దిగుబడిని ఇచ్చే జీడి అంట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి గిరిజన రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా మరింత అభివృధి చెందాలని హితవుపలికారు.ఈ ఉద్యానవన రైతుల శిక్షణా కార్యక్రమానికి పి.హెచ్. ఓ శ్రీనివాస రావు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, ఎ.పి.ఓ లు, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉద్యాన రైతులు తదితరులు పాల్గొన్నారు.