ఏజెన్సీలోని మారుమూల గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల స్పష్టం చేశారు. మంగళవారం అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గుణతో కలిసి గుంటసీమ బాలుర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖమంత్రి వారి ఆదేశాలు జిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లిఖార్జున సూచనల మేరకు ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో పివి టిజి గిరిజనులకు అందుబాటులో ఉండే విధంగా మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ -ఐటీడీఏ సంయుక్తంగా కొరవంగి ,పెదవలస, ఉప్ప, నుర్మతి గ్రామాలలో మెగావైద్య శిబిరాలు నిర్వహించామని చెప్పారు.వైద్య శిబిరాలను నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. మెగా వైద్య శిబిరం లో స్త్రీల వైద్యనిపుణులు, కంటి, చెవి,ముక్కు, జనరల్ వైద్యులు పాల్గొని వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఆపరేషన్ అవసమైన వారికి శస్త్ర చికిత్సలు చేయిస్తామని చెప్పారు. త్వరలో మన్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తామని దానికి అవసరమైన డేటా సేకరిస్తున్నామని పేర్కొన్నారు. పాడేరు లో రెడ్ క్రాస్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దానికి అవసరమైన భవనం కేటాయించామని తెలియజేసారు. సికిల్ సెల్ ఎనిమియా పరీక్షలు చేపడతామని అన్నారు. 30 పి.హెచ్ సి లలో నాడు నేడు అభివృద్ధి పనులు జరూగుతున్నాయని చెప్పారు. డెంగ్యూ పరీక్షలకు నిధులు విడుదల చేశామని చెప్పారు. గిరిజనులను ఎక్కడ నుంచి వచ్చారని పి.ఓ ఆప్యాయంగా పలకరించారు. ఒపి వివరాలు పరిశీలించారు. వెయ్యి. మందికి కోవిడ్ వాక్సినేషన్ వేయడం లక్ష్యాన్ని నిర్దేశించామని చెప్పారు
అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గుణ మాట్లాడుతూ గునసీమ మెగా వైద్య శిబిరానికి గిరిజనులు భారీగా తరలి వచ్చారని చెప్పారు. మెగా. వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని ప్రాజెక్టు అధికారినకి పూల మాలవేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బి.ఈశ్వరి, సర్పంచ్ నాగేశ్వరరావు, జెడ్ పి టి సి జనకమ్మ, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ రాజేష్ అదనపు జిల్లా వైద్యాధికారి డా.లీలప్రసాద్, డా.టి. విశ్వేశ్వరరావు, ఎంపిడివో ,తహసీల్దార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.