మావోయిస్టుల ఆచూకీ కోసం డ్రోన్లు..
Ens Balu
3
sukma
2020-09-14 13:40:37
దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత సాంకేతిక వ్యవస్థను వినియోగిస్తున్నాయి. మావోయిస్టుల ఆచూకీ తెలుసుకోవడానికి డ్రోన్లు ఉపయోగించి, అనుమానిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నాయి. ఈ మేరకు ఏబోబితో పాటు, చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతాల్లోనూ కూంబింగ్ చేపడుతుంది. రెండు రోజుల క్రితం సుక్మాజిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు వాగుదాటుతున్నట్టుగా డిపార్ట్ మెంట్ డ్రోన్ కెమెరాలు ఫోటోలు తీశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు జిల్లా వ్యాప్తంగా వున్న అటవీ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశారు.అటవీ ప్రాంతంలోని ఉపయోగించే డ్రోన్లు జిపిఎస్ సహాయంలో తీసిన వీడియోలు, ఫోటోలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి పంపుతాయని తెలుస్తోంది. గతంలోనే ఈ తహార గగణ తల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం కీలక ప్రాంతాల్లోనే వీటిని వినియోగించేది. ఇపుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వీటిని వినియోగించి మావోయిస్టుల జాడను కనుగొనే కార్యక్రమం చేపట్టింది. వీటిని గాల్లోనే ధ్వంసం చేయాలని మావోయిస్టులు చూసినప్పటికీ, వాటికి చిక్కకుండా అత్యంత ఎత్తైన ప్రదేశంలో వీటిని ఆపరేట్ చేస్తూ, కంటికి కనపడని విధంగా వీటిని వినియోగిస్తున్నారని తెలుస్తుంది. ఈ డిపార్ట్ మెంటల్ డ్రోన్ల వలన ఫలితాలు బాగానే వస్తున్నట్టు పోలీసు వర్గాలు వీటిని వినియోగించి తీసిన ఫోటోలు, వీడియోలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.