సమాజంలో మీడియాని, జర్నలిస్టులను ఫోర్త్ పిల్లర్ అంటారు కదా.. అలాంటి జర్నలిస్టు పనిచేయకపోతే ఏమైనా అవుతుందా..? ఒక్కసారి ఆలోచించి చూడండి. వాస్తవానికి సమాజానికి జర్నలిస్టు నిజంగా ఒక దిక్సూచి.. సమాచార సారధి.. పొలిటికల్ డిఫెండర్.. పీలపు ల్ లెజండర్..అవును మీరు చదువుతున్నది అక్షర సత్యం. జర్నలిస్టు అనే వాడు ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజు పనిచేయడం మానేస్తే వ్యవస్థలు మొత్తం తలకిందులైపోతాయి. మీరు అనుకోవచ్చు.. సోషల్ మీడియా ఉంది కదా అని. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు, డిజైన్ చేసిన యాడ్స్ మాత్రమే షేర్ చేసుకోవడానికి వీలుపడుతుంది కానీ ఒక విషయాన్ని సవివరంగా తెలియజేసే పరిస్థితి ఉండదు. మీకు ఈ ఒక్క ఉదాహరణ చాలు.. నిజంగా ఈ లైన్ చదివిన తరువాత మీకు నవ్వు రాకపోతే మీలోనూ ఏదో లోపమున్నట్టుగానే భావించుకోండి. అలాంటి సమాచారమే అన్ని విషయాల్లోనూ వస్తే సమాజం పరిస్థితి ఏంటో కూడా మీరే అర్ధం చేసుకోండి.. అదేమిటో ఒక్కసారి ఈ లైన్ చదవండి.. శ్రీశ్రీశ్రీ మా ఎమ్మెల్యేగారు పలాన పార్టీ కార్యకర్త ఇంటికి వాళ్ల అమ్మాయి పెద్దమనిషి ఫంక్షన్ కి వెళ్లి.. ఆయన చేతులు మీదుగా అమ్మాయి తలపై అక్షింతలు వేశారు..భోజనాల్లో కూర్చొని భోజనం చేసి వచ్చారు.
ఈ కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారితోపాటు.. ఆ సారూ(గార్లు, బూర్లు, అప్పడాలు, వడలు) ఈసారూ ఈసారు పాల్గొన్నారు.. యటకారం కాకపోతే ప్రతీ దానికి ఈ పదమే వాడతారు అదేంటో విచిత్రంగా.. చేతులు మీదుగా అక్షింతలు వేయకపోతే కాళ్లతో వేస్తారటండీ.. మా మంత్రిగారు తన కాళ్లపై తానే నిలబడ్డారు.. కంటితోనే చూశారు.. గు..తోనే పి...త్తా..రు.. ఏంటి పదాల సంబోధన. సోషల్ మీడియాలో వచ్చే విషయం ఈ విధంగానే ఉంటుంది మరి.. అదే జర్నలిస్టు ఒక వార్త రాస్తే.. పార్టీ కార్యకర్త ఇంట్లో శుభకార్యానికి వెళ్లి స్వయంగా దీవించిన వచ్చిన ఎమ్మెల్యే అని రాస్తాడు. ఈ పదాల అల్లికకు.. సోషల్ మీడియాలో వచ్చే పదాల అమరికకు ఎంత తేడా ఉందో ఒక్కసారి మనం బాగా ఆలోచించుకోవాలి. ఇది కేవలం ఉదాహరణకు మాత్రమే. ఇకపోతే ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా సమాచారం వచ్చేది కేవలం జర్నలిస్టుకి మాత్రమే. ఆ జర్నలిస్టు సమాచారం వార్తల రూపంలో అందించకపోతే ప్రభుత్వాలు, ప్రజలు, ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏ విధంగా వుంటుందో ఆలోచిస్తేనే రకరకాలుగా ఉంటుంది. కాకపోతే ఏ మీడియాలోనూ జర్నలిస్టులు పనిచేయకుండా ఉండలేదు నేటి వరకూ.. అంతెందుకు ఏడాదిలో మూడు రోజులు పత్రికలకి సెలవులు వస్తేనే మనకి తెలియకుండా బయట ఏం జరిగిపోయిందోననే ఆందోళన.
మానసిక సంఘర్షణ. వెంటనే సెల్ ఫోనులో వెతుకులా. కాకపోతే నేడు ప్రసార మాద్యమాలు వచ్చిన తరువాత పత్రికలకు కాస్త డిమాండ్ తగ్గింది. లేదంటే ఎక్కడో విజయవాడలోని ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింటింగ్ అయ్యే పత్రిక మరుసటి రోజు సాయంత్రానికి విశాఖపట్నం వస్తే గాని పేపర్ లో ఏం వచ్చేదో ఎవరికీ తెలిసే పరిస్థితి ఉండేది కాదు ఒకపుడు. కానీ నేడు సమాచార విప్లవం తెచ్చిన స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా పుణ్యమాని మీడియా అవసరం చాలా వరకూ లేకుండానే పోతుంది. ఎంత టెక్నాలజీ వచ్చినా, సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందినా ఎక్కడైనా.. ఎప్పుడై.. ఎవరికోసమైనా వార్త రాయాల్సింది మాత్రం జర్నలిస్టే. చాలా మందికి ఈ ముఖ్యమై సాంకేతిక కారణం తెలియదు. మీడియా లేకపోతే సోషల్ మీడియా ఉందనుకుంటారు తప్పితే అక్కడే స్క్రిప్ట్ రాసేది ఒక జర్నలిస్టు మాత్రమేనని గుర్తించడం లేదు. విషయం సేకరించాలన్నా జర్నలిస్టు.. దానిని వార్తగా రాయాలన్నా జర్నలిస్టు.. ప్రశ్నించాలన్నా జర్నలిస్టు.. ప్రజాప్రతినిధి చేసిన మంచిని ప్రజలకు తెలియజేయాలన్నా జర్నలిస్టు.. ప్రభుత్వం కోసం ప్రజలకు వివరించాలన్నా జర్నలిస్టు.. సంక్షేమ పథకం వివరాలు తెలియజేయాలన్నా జర్నలిస్టు.. ఒక అవినీతి అధికారి లంచావతారాన్ని బయటపెట్టాలన్నా జర్నలిస్టు.. ప్రజలకు చక్కటి వైద్యం అందించే వైద్యుల సేవలను కొనియాడుతూ కీర్తించి రాయాలన్నా జర్నలిస్టు.. ప్రభుత్వానికి మందుబాబులే ఆదాయాన్ని పెద్ద మొత్తంలో సమకూర్చి పెడుతున్నారనే విషయాన్ని తెలియజేయాలన్నా కూడా జర్నలిస్టు మాత్రమే.. అందుకే మీడియా.. అందులో పనిచేసే జర్నలిస్టుకి అంత విలువ.
అదే నేడు సమాజంలో ఫోర్త్ పిల్లర్ గా జర్నలిస్టుకి ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆడదాని వలన రాజ్యాలే కూలిపోయాయన్నది ఒకప్పటి మాట. నేడు జర్నలిస్టులు లేకపోతే సమాజమే మూగబోతుంది.. ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోతాయన్నిది నేటి మాట. జర్నలిస్టుకోసం తెలియవారు చులకనగా చూసినా.. చదువుకొని, లోకం తీరును ఒడిసి పట్టే వారికి మాత్రం జర్నలిస్టు అంటే ఏంటో.. మీడియా విలువ ఏంటో తెలుసును కాబట్టే ఇంకా జర్నలిస్టుకి గౌరవం.. కాస్తో కూస్తో విలువలు ఉన్నాయి. లేదంటే మీడియా, జర్నలిస్టులు ఎప్పుడో కనుమరుగు అయ్యేవారు. సాధారణంగా మనం ఆహారం లేకపోతే ఉండలేం. కానీ జర్నలిస్టుకి వార్తల లేకపోతే ఉండలేదు. ఆకలితో పస్తులైనా ఉంటాడు గానీ.. సమయానికి వార్తలు అందించి సమాజాన్ని మేల్కొలపడంలో మాత్రం జర్నలిస్టు ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పుడు చెప్పండి అలాంటి జర్నలిస్టు లేని సమాజాన్ని ఊహించుకోగలమా.. అది జరుగుతుందా..? అందుకే ఈరోజు వార్త యందు జగము వర్ధిల్లుతున్నది. జై జర్నలిం.. జై జై జర్నలిస్టు.. జిందాబాద్ జర్నలిస్టు..లాంగ్ లివింగ్ మీడియా..!